మ‌హా శివ‌రాత్రి విశిష్ట‌త : జాగర‌ణ చేయాల్సిన ప‌ద్ద‌తులు

Submitted by lakshman on Tue, 02/13/2018 - 08:32
maha shivaratri jagran

విశ్వానికే ఆదిదేవుడు శివునితో ఉపవసించటం అనేది ఒక మహా భాగ్యం.ఆయన కోసం ధ్యానం చేస్తూ అనుక్షణం ఆయన్నే తలుస్తూ మనసంతా ఆ మహాద్భుత రూపాన్ని నింపుకొని భక్తి ప్రపత్తులతో జాగరణ సమర్పించటం మహ శివరాత్రి రోజు శివ భక్తులు చెసే పవిత్ర కార్యం. 
"ఉపవాసం" — అనగా దగ్గరగా నివసించడం. "ఉప" అంటే దగ్గరగా "వాసం"  అంటే నివసించడం అని అర్ధం. కొన్ని ప్రత్యేక పండుగల సమయాలలో ఈ ఉపవాసదీక్షను చేప డతారు. ఉపవాసం ఉండాలనుకున్న రోజు దేవుని యందు మనస్సు లగ్నం చేయడానికి ఆహార, పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకుని నిరాహారంగా  ఉంటారు. ఈ ఉపవాసం చేసే దీక్షను బట్టి ఒక పూట లేక ఒక రోజు లేక కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది.
భక్తితో కావచ్చు బరువు తగ్గేందుకు కావచ్చు కారణమేదైనా చాలామంది తరచూ ఉపవాసం చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తరచూ ఉపవాసాలు చేస్తుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా అస్సలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండి పోతుంటే బలహీనత, అసిడిటీ, నీరసించి పోవటం,  తలనొప్పుల వంటి బాధలు చాలా వేధిస్తాయి. కాబట్టి ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా లంఖణం చేయటం కాదని, ఈ సమయంలో కూడా శరీరానికి పోషకాలు అవసరమని గుర్తించాలి.
మధుమేహం, అసిడిటీ వంటి సమస్యలున్నవారు, గర్భిణులు, పిల్లలు, అసలు ఉపవాసం చేయకపోవటం మేలు. మరోవైపు చాలామంది ఉపవాసం ముగిస్తూనే బాగా నూనె, నెయ్యి వేసి వండిన స్వీట్లు, కొవ్వు పదార్ధాల వంటివి దండిగా తింటుంటారు. ఇదీ మంచిది కాదు. దీనివల్ల ఉపవాస ఫలమూ ఉండదు. కాబట్టి ఉపవాస సమయంలో- మన శరీరానికి అవసరమైన పోషకాహారం, మితంగా తీసుకోవటం మంచిది. ఇలా చేస్తే ఉపవాసం తర్వాత శరీరం మరింత ఉత్తేజంగా, తేలికగా, ఉల్లాసంగా అనిపిస్తుంది.
ఉపవాస సమయంలో- పండ్లు, కూరగాయల వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. పండ్లు దండిగా తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది, శక్తికీ  కొదవుండదు. అలాగే పాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, క్యారెట్ల వంటి వాటితో చేసిన పదార్ధాలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి, మాంసకృత్తులు, క్యాల్షియం వంటివన్నీ లభిస్తాయి. ఉపవాస సమయంలో- మజ్జిగ, పండ్ల రసం, నిమ్మ నీరు, కూరగాయ సూపుల వంటి ద్రవాహారం తరచుగా తీసుకోవాలి. ఇలా చేస్తే అసిడిటీ బాధ కూడా ఉండదు.
ఉపవాసం ముగిసిన తర్వాత కూడా కొవ్వుపదార్ధాలు కాకుండా, మెంతికూర కలిపి చేసిన మేథీచపాతీ; సగ్గుబియ్యం,కూరగాయ   వంటివి కలిపిన కిచిడీ; పాలు, పెసర పప్పు వంటి వాటితో చేసిన పాయసం వంటివి తీసుకోవటం ఉత్తమం.
"జాగరణము" — మహాశివరాత్రి ఒక హిందువుల పండుగ. శివుడుని భక్తితో కొలుస్తూ ఏటా జరుపుకుంటారు. ఇది శివ, దేవేరి పార్వతి వివాహం జరిగిన రోజు. మహా శివరాత్రి పండుగను 'శివ రాత్రి' అని కూడా ప్రముఖంగా పిలుస్తారు. మరికొందరు  'శివుడి యొక్క మహా.....రాత్రి', అని లేదా  "శివ మరియు శక్తి యొక్క కలయిక " ను సూచిస్తుందని అంటారు.
మహా శివరాత్రి చాంద్రమానం ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహా శివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రతో కలసి ఉన్నప్పుడు శివుడు "లింగాకారం" గా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. హిందువుల క్యాలెండర్ లో ఫాల్గుణ మాసము కృష్ణపక్ష చతుర్దశి. సంవత్సరంలో ఉన్న పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది.పండుగ ప్రధానంగా బిల్వదళాలు శివుడికి సమర్పించటం ద్వారా జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం మరియు రాత్రి అంతా జాగరణ చేసారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. శివరాత్రి రోజు శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివపూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగు తుంది.
తపస్సు యోగం ధ్యానం వాటి అభ్యాసంతో క్రమంగా మరియు వేగంగా మంచి జీవనఫల సాధనకు, ముక్తి పొందడానికి ఉప వాసం జాగరణ తదాత్మ్యతతో నిర్వహిస్తారు. ఈ రోజు, ఉత్తర దృవం గ్రహస్థానాలు అంతా బలమైనవిగా తపస్సు, యోగ, ధ్యాన చర్యలతో ఒక వ్యక్తి అత్యంత సులభంగా ఆ వ్యక్తి ఆధ్యాత్మిక శక్తి పెంచడానికి ఉత్ప్రేరకాలుగా ఉంటాయి. 
మహా మృత్యుంజయ మంత్రం వంటి శక్తి వంతమైన పురాతన సంస్కృత మంత్రాల యొక్క ప్రయోజనాల శక్తి మహ శివరాత్రి రోజు వేల రెట్లు పెరుగుతుంది.
పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్యచరిత్రములో విపులంగా వర్ణించాడు. శైవులు ధరించే భస్మము, విభూతి తయారు చేయటానికి మహశివరాత్రి రోజు పవిత్రమైనదని భావిస్తారు. రోజు అంతా భక్తులు "ఓం నమః శివాయ"  అంటూ శివ పవిత్ర మంత్రం పఠిస్తారు.

English Title
2018 Maha Shivaratri, Shivratri Date and Time for Ujjain

MORE FROM AUTHOR

RELATED ARTICLES