రజనీకాంత్ అభిమానులకు దీపావళి గిఫ్ట్...సోషల్‌ మీడియాలో హిస్టరీ క్రియేట్ చేస్తున్న 2.0

x
Highlights

ఇండియన్‌ మోస్ట్ కాస్ట్ ఫిలిం సూపర్ స్టార్ రజనీ కాంత్ అప్ కమింగ్ మూవీ రోబో 2.ఓ ట్రైలర్‌ గ్రాండ్‌గా రిలీజైంది. బాహుబలిని మించిపోయేలా గ్రాఫిక్స్ తో రోబో...

ఇండియన్‌ మోస్ట్ కాస్ట్ ఫిలిం సూపర్ స్టార్ రజనీ కాంత్ అప్ కమింగ్ మూవీ రోబో 2.ఓ ట్రైలర్‌ గ్రాండ్‌గా రిలీజైంది. బాహుబలిని మించిపోయేలా గ్రాఫిక్స్ తో రోబో 2. ఓ అలరించింది. విడుదలైన గంటల్లో ఈ ట్రైలర్‌ కు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. చెన్నైలో అట్ట‌హాసంగా జ‌రిగిన 2.ఓ ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌లో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు.

ప్ర‌ముఖ ద‌ర్శకుడు శంక‌ర్ విజువ‌ల్ వండ‌ర్ మూవీ 4డి ఫార్మెట్ లో రిలీజైన ట్రైలర్‌ దుమ్మురేపుతోంది. భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి 4డీ సౌండ్ సిస్టమ్‌లో 2.ఓ రూపొందించారు. 4డీ సౌండ్‌ టెక్నాలజీతో విడుదల చేసిన చిత్ర ట్రైల‌ర్‌ని అదరహో అనిపించింది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీలో సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా బాలీవుడ్ టాప్ హీరో అక్ష‌య్ కుమార్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నువిందు చేయనున్నారు.

ఈసారి శంకర్‌ సెల్ ఫోన్ ని విలన్ కు ఆయుధంగా మలిచాడు. ఊహకందని మాయజాలంతో మాయచేశాడు. అతి పెద్ద ఆకారంతో ఉన్న గద్ద లాంటి పక్షి చేస్తున్న భీభత్సం-రజని వెంట పడుతూ అతన్ని అంతమొందించే ప్రయత్నం చేయడం- జనం భయంతో పరుగులు తీయడం-స్టేడియం లో రోబో అక్షయ్‌లు ఆకాశాన్ని తాకే ఆకారాలతో భీకరమైన పోరాట సీన్లు అంతా ఏదో వింత లోకం‌లో విహరించిన అనుభూతి కలిగించింది ట్రైలర్‌.

రజనీ యాక్షన్‌, అక్షయ్‌ లుక్‌, రోబో అమీ జాక్సన్‌ గ్లామర్‌ ఇలా అన్ని ట్రైలర్‌కు ఇంటర్‌నేషనల్‌ స్టాండర్డ్స్‌ తీసుకువచ్చాయి. హాలీవుడ్‌ టెక్నిషియన్లతో 4డీ సౌండ్‌ టెక్నాలజీతో విడుద‌ల చేసిన ట్రైలర్‌ ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేసింది. ప్రతి ఫ్రేమ్‌, ప్రతి సీన్‌ ప్రేక్ష‌కుల‌ రోమాలు నిక్క పొడుచుకునేలా చేసింది. ఏఆర్ రెహ‌మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా మారింది. శంకర్‌ విజువల్‌ వండర్‌కి ఆడియెన్స్‌ ఫిదా కావడంతో పాటు ఎగ్జైటింగ్‌గా కట్ చేసిన ట్రైలర్ తో అంచనాలు అంతరిక్షాన్ని దాటేశాయి.

కేవలం తమిళ - తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రజినీ - శంకర్ ల కాంబోలో రోబో తర్వాత వస్తున్న చిత్రం కావ్వడంతో పాటు హాలీవుడ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీన్స్ , విజువల్ ఎఫెక్స్ వస్తున్న ఈ మూవీ ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories