‘2.ఓ’ తొలి రోజు వసూళ్లు ఎంత..?

Submitted by arun on Fri, 11/30/2018 - 11:41
2.0

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన '2.ఓ' సినిమా నిన్ననే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రజనీ .. అక్షయ్ .. ఎమీ జాక్సన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 10,500 థియేటర్స్ లో విడుదలై కొత్త రికార్డును సాధించింది. కేవలం తమిళనాట 30 కోట్లకు పైగా వసూళ్ల వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15 కోట్ల వరకు కలెక్షన్లు ఉండే అవకాశం ఉంది. ఇక అక్షయ్‌ కుమార్ ప్రతినాయక పాత్రలో నటించటంతో బాలీవుడ్‌లోనూ సినిమా భారీ వసూళ్లే సాధిస్తోంది. తొలి రోజు ఉత్తరాదిలో 20 నుంచి 25 కోట్ల వరకు వసూళ్లు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ఇక ఓవర్‌సీస్‌కూడా కలుపుకుంటే 100 కోట్ల మార్క్‌ ఈజీగానే రీచ్‌ అయి ఉంటుందన్న టాక్‌ వినిపిస్తోంది. లెక్కలు సరిగ్గా తెలియాలంటే మాత్రం అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

English Title
2.0 Box office collection day 1

MORE FROM AUTHOR

RELATED ARTICLES