ఫొటో పిచ్చి.. పరువు తీసుకున్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే

Submitted by arun on Sun, 01/14/2018 - 11:01
bjp

ఓ బీజేపీ ఎంపీ, మరో బీజేపీ ఎమ్మెల్యే... పత్రికల్లో తమ ఫోటోలు కనిపించాలన్న 'ప్రచార పిచ్చి' వారి పరువు తీసింది. ప్రజా ప్రతినిధులై ఉండి వారు వ్యవహరించిన తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎంపీ రేఖావర్మ, మరో మహిళా ఎమ్మెల్యే తమ మద్దతుదారులతో కలిసి దుప్పట్లు పంపిణీ చేసేందుకు సీతాపూర్‌ జిల్లాకు వెళ్లారు. పెద్దపెద్ద అధికార ప్రతినిధులు హాజరవడంతోపాటు వారి మద్దతుదారులు కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. గత కొద్ది రోజులుగా విపరీతమైన చలికారణంగా పలువురు రోడ్డుపక్కన ఉండేవారు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో వారికి దుప్పట్ల సాయం చేసేందుకు వెళ్లారు. అయితే, అక్కడికి వెళ్లిన వారు దుప్పట్లు పంచే క్రమంలో ఫొటో విషయంలో పంచాయితీ పెట్టున్నారు. తానంటే తాను ముందు ఫొటో దిగాలంటూ గొడవకు దిగారు. అందరూ చూస్తున్నారనే సోయి మరిచిపోయి ఆగ్రహంతో ఊగిపోతూ ఒకరినొకరు తోసుకున్నారు. ఎమ్మెల్యే మద్దతుదారుడిని ఎంపీ కొట్టగా, ఎంపీ మద్దతుదారుడిపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. వీరి గొడవ గురించి తెలుసుకున్న కలెక్టర్, పోలీసు అధికారులు అక్కడికి వెళ్లి సర్ది చెప్పి అందరినీ పంపించారు. 

English Title
2 bjp leaders wanted their photo

MORE FROM AUTHOR

RELATED ARTICLES