ఇతర కులం యువకుడితో యువతి పారిపోయేందుకు యత్నించిందని...

Submitted by arun on Sat, 10/06/2018 - 10:43
Muslim girl, Bihar

ఓ యువతి ఇతర కులం అబ్బాయిని ప్రేమించి అతనితో లేచిపోయేందుకు యత్నించిన ఓ యువతిని గ్రామస్థులు చెట్టుకు కట్టేసి కొట్టిన దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలోని జోగియా మారన్ గ్రామంలో సంచలనం రేపింది. వివరాలు.. జగియా మారన్‌ గ్రామానికి చెందిన మొహమ్మద్‌ ఫరీద్‌ అన్సారీ కూతురు (18) పొరుగూరుకు చెందిన రూపేష్‌ కుమార్‌ని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. యువతి ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెబితే తిరస్కరించారు. పెళ్లి చేసుకోవాలని భావించిన యువతి ప్రియుడితో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అతడితో కలిసి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీనిని గమనించిన గ్రామస్థులు ఆమెను పట్టుకుని పంచాయతీ నిర్వహించారు. ఆమెను చెట్టుకు కట్టేసి చావబాదారు. వేరే కులం యువకుడితో వెళ్లేందుకు ప్రయత్నించి గ్రామం పరువు తీసిందని ఆరోపించారు. చెట్టుకు కట్టేసి ఐదు గంటల పాటు హింసించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్పృహ కోల్పోయిన యువతిని విడిపించి ఆసుపత్రికి తరలించారు. గ్రామ పెద్దలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English Title
18-year-old Muslim girl in love with Hindu boy tied to tree, thrashed in Bihar

MORE FROM AUTHOR

RELATED ARTICLES