డెడ్ లైన్ 15నే..ఆ త‌ర్వాత ప‌వ‌న్

డెడ్ లైన్ 15నే..ఆ త‌ర్వాత ప‌వ‌న్
x
Highlights

పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్‌కు వరుసగా కష్టాలు ఎదురవుతున్నాయా ? ఒక వైపు రాజకీయంగా నిలకడ లేదనే విమర్శలు వస్తుంటే...మరోవైపు అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్‌...

పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్‌కు వరుసగా కష్టాలు ఎదురవుతున్నాయా ? ఒక వైపు రాజకీయంగా నిలకడ లేదనే విమర్శలు వస్తుంటే...మరోవైపు అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్‌ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశలో మిగిలిపోయారు. అటు కత్తి మహేశ్‌ లాంటి వారు టార్గెట్‌ చేయడం...వ్యక్తిగతంగా, రాజకీయంగా ఇబ్బందిగా మారింది.

పవన్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కు....గత కొంతకాలంగా ఏదీ కలిసి రావడం లేదు. జనసేన ఏర్పాటు చేసి నాలుగేళ్లవుతున్నా...ఇంతవరకు పార్టీకి ఒక రూపు తీసుకురాలేకపోయారు. ప్రజా సమస్యలపై అప్పుడప్పుడు ప్రశ్నిస్తున్నా...పార్ట్ టైమ్ పొలిటీషియన్‌గానే ప్రజలు భావిస్తున్నారు. మరో వైపు బాబుకి ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే పవన్ బయటకు వస్తున్నారన్న అపవాదుని ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో నాలుగు రోజుల పాటు పర్యటించిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి ప్రతిపక్షంపై ప్రశ్నలు ఎక్కుపెట్టారు. ప్రజారాజ్యం, పరిటాల రవితో తనకు జరిగిన అవమానంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై అభిమానులు అనవసర విషయాలను జనసేనాని తిరగదోడారని అభిప్రాయపడుతున్నారు.

సోషల్ మీడియా వేదికగా పవన్‌ కల్యాణ్‌ను...కత్తి మహేశ్‌ టార్గెట్ చేస్తున్నారు. అభిమానులు, కత్తి మహేశ్‌ మధ్య మాటల యుద్దం జరుగుతోంది. పవన్‌పై వచ్చే విమర్శలకు ఆయన అభిమానులు అతిగా స్పందించడం... జనసేనానికి ఇబ్బందిగా మారింది. తన పైన, పార్టీపైన వచ్చే విమర్శలకు సమయం వచ్చినప్పుడు తానే సమాధానం చెబుతానన్న పవన్‌ అంటున్నా...అభిమానులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇది చివరకు పవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి పూనమ్ కౌర్‌త్‌ ఉన్న సంబంధాలపై సమాధానం చెప్పాలనే పరిస్థితి వరకు వచ్చింది. కత్తి-పవన్ అభిమానుల మాటల యుద్ధంపై సినీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో... ఈ నెల 15 వరకు మాట్లాడనని కత్తి మహేష్ అంటున్నారు. ఆ తరువాత మాటల యుద్ధం ఎటు వెళ్తుందో ప్రశ్నగా మారింది.

రాజకీయ విమర్శలకు, కత్తి మహేశ్‌ లాంటి వ్యక్తులు చేసే విమర్శలకు... అజ్ఞాతవాసి సినిమా ద్వారా చెక్ పెట్టవచ్చని పవన్‌ అభిమానులు భావించారు. సినిమా సూపర్ హిట్ అయితే...పవన్‌కి తిరుగు ఉండదనుకున్నారు. అజ్ఞాతవాసి కాస్తా అలరించకపోవడంతో అభిమానులు నిరాశలో పడిపోయారు. గతంలో వచ్చిన సర్ధార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు... ఇప్పుడు అజ్ఞాతవాసి వరుసగా అభిమానులని నిరాశ పరిచాయి. రాజకీయాలకు పూర్తి సమయం కేటాయిస్తానని, సినిమాలు మనేస్తానంటూ పవన్ చెప్పుకొచ్చారు. మరి అజ్ఞాతవాసి సినిమా నిరాశ పరచడంతో పవన్ రాజకీయాలపై పూర్తి దృష్టి పెడతారా....మరో మూవీకి సిద్ధం అవుతారా అన్న ప్రశ్నలు అభిమానులను కలవరపెడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories