కర్ణాటక వేదికగా మోడీ వ్యతిరేక ఫ్రంట్ ప్రయత్నాలు...ఒక్కటైన 14 పార్టీల నేతలు

x
Highlights

కర్ణాటక వేదికగా కొత్త శకం మొదలైంది. కుమారస్వామి ప్రమాణస్వీకార వేడుక.. మోడీ వ్యతిరేక ఫ్రంట్‌కు బీజం వేసినట్లైంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 14...

కర్ణాటక వేదికగా కొత్త శకం మొదలైంది. కుమారస్వామి ప్రమాణస్వీకార వేడుక.. మోడీ వ్యతిరేక ఫ్రంట్‌కు బీజం వేసినట్లైంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 14 పార్టీల నేతలు ఒకే వేదికపై నుంచి.. భవిష్యత్ ఎన్నికలకు మేమంతా కలిసి వస్తున్నామనే సిగ్నల్ ఇచ్చారు. కాంగ్రెస్, లెఫ్ట్, ప్రాంతీయ పార్టీల నాయకులంతా ఒకే స్టేజ్‌పైకి చేరుకొని.. మోడీ వ్యతిరేక పార్టీలన్నీ ఒక్కటిగానే ఉన్నాయన్న సంకేతం ఇచ్చారు.

బెంగళూరు వేదికగా.. నరేంద్రమోడీ వ్యతిరేక ఫ్రంట్‌కు బీజం పడింది. కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవ వేడుక.. దేశంలోని వివిధ పార్టీల నేతలందరినీ ఒకే వేదికపైకి చేర్చింది. కాంగ్రెస్, లెఫ్ట్, ప్రాంతీయ పార్టీలన్నీ కలుపుకొని.. మొత్తం 14 పార్టీల నేతలు ఒకే స్టేజ్‌పై కనిపించారు. వీళ్లంతా.. తామంతా ఒక్కటేనన్న సంకేతం ఇచ్చారు.

ప్రమాణస్వీకారోత్సవ వేడుకలో.. వివిధ పార్టీల నాయకుల పలకరింపులు, కరచాలనాలు, నవ్వులు, చర్చలు.. ఇలా స్టేజ్ మొత్తం సందడిగా కనిపించింది. దీంతో.. మోడీ వ్యతిరేక పార్టీలన్నీ ఒక్కటిగానే ఉన్నాయి.. వచ్చే ఎన్నికల్లో.. తామంతా మోడీ వ్యతిరేక కూటమిగా రాబోతున్నట్లుగా సంకేతాలిచ్చారు నాయకులు. బీజేపీయేతర పార్టీలన్నీ బెంగళూరు నుంచే జర్నీ మొదలుపెట్టినట్లు ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేశారు.

ఇక.. ఏపీ సీఎం చంద్రబాబైతే.. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవ వేడుకు గట్టిగానే వాడుకున్నారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక.. తొలిసారి బీజేపీయేతర పార్టీలతో బాబు కీలక చర్చలు జరిపారు. అసలు ప్రోగ్రాం మొదలయ్యేకంటే ముందే.. బాబు వివిధ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, లెఫ్ట్ పార్టీల నాయకులు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డితో విడివిడిగా భేటీ అయ్యారు. ప్రధానంగా ఏపీ పరిణామాలతో పాటు జాతీయ రాజకీయాలపైనా బాబు చర్చించారు.

ప్రమాణస్వీకారోత్సవ వేదికపై.. ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్‌ గాంధీ, సీఎం చంద్రబాబు మధ్య జరిగిన సన్నివేశాలు ఇప్పుడు ఇంట్రస్టింగ్‍‌గా మారాయి. కన్నడ ప్రజలకు అభివాదం తెలిపేందుకు రాహుల్‌ను ముందుకు పిలవడం, అభివాదం చేయించడం, తర్వాత కరచాలనం అన్నీ.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇదంతా చూస్తుంటే.. భవిష్యత్‌లో చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి వెళ్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా.. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్స వేడుక.. విధానసౌధ వేదిక.. రెండూ మోడీ వ్యతిరేక ఫ్రంట్‌కు తెరతీశాయని చెప్తున్నారు రాజకీయవిశ్లేషకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories