అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం...

Submitted by arun on Thu, 11/08/2018 - 17:31
California

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది. కాలిఫోర్నియాలోని థౌజండ్‌ ఓక్స్‌ ప్రాంతంలోని బోర్డర్‌లైన్‌ బార్‌ అండ్‌ గ్రిల్‌లోకి గురువారం తెల్లవారుజామున చొరబడిన ఓ వ్యక్తి అక్కడున్న వారిపై దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గన్‌మెన్‌తో సహా 13మంది మృతి  చెందగా గాయపడ్డవారిని ఆస్పత్రి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు హుటా హుటినా ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. కాలేజీ విద్యార్ధులు పార్టీ చేసుకుంటుండగా ఈ ఘటన సంభవించింది. బార్‌లో నుంచి తుపాకీ పేలుళ్ల శబ్దం వినిపించడంతో కాలిఫోర్నియా హైవే పెట్రోల్‌ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. వందలాదీ మందికి పైగా బార్‌లోనే ఉన్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.ఈ కాల్పుల్లో ఎవరైన ప్రాణాలు కోల్పోయారా అనే విషయానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

English Title
13 dead including gunman in shooting at California bar

MORE FROM AUTHOR

RELATED ARTICLES