త్వ‌ర‌గా పెళ్లి చేసుకోండి..లేదంటే..?

Submitted by lakshman on Tue, 02/06/2018 - 03:17
 11 Reasons Why Getting Married Early

వ‌ద్దురా సోద‌రా పెళ్లంటే నూరేళ్ల మంట‌రా అని పాట‌లు పాడుకుంటూ నేటి యువ‌త  గ‌డిపేస్తున్నారు. వ‌య‌సు  30 అయినా పెళ్లి పెటాకులు లేకుండా తెగిన గాలిప‌టంలా తిరుగుతుంటారు.  అన్నీ ఉన్నా కొంత‌మంది ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌డానికి కార‌ణం లేటు వ‌య‌సులో మ్యారేజ్ చేసుకోవ‌డ‌మేన‌ని వైద్యులు చెబుతున్నారు. ఓ సంస్థ  దాదాపు 8 సంవ‌త్స‌రాల పాటు స‌ర్వేచేసి లేటు వ‌య‌సులో పెళ్లి చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు త‌లెత్తుతాయి. త్వ‌ర‌గా పెళ్లి చేసుకుంటే ఎలాంటి ఉప‌యోగాలు ఉన్నాయి అనే వాటిపై కులంక‌షంగా చ‌ర్చించింది. ప్ర‌జెంట్ జ‌న‌రేష‌న్ లో పెళ్లికంటే డ‌బ్బు గురించి యువ‌త ఎక్కువ‌గా ఆలోచిస్తుంది. దీంతో డ‌బ్బు మీద ఆశ‌తో పెళ్లిళ్ల‌ని వాయిదా వేసి  రేయింబ‌వుళ్లు క‌ష్ట‌ప‌డుతు నాలుగు చేతులా డ‌బ్బులు సంపాదిస్తున్నారు. మ‌రి పెళ్లెప్పుడు చేసుకుంటారా అంటే 30, 40లో పెళ్లిళ్లు చేసుకొని ఇబ్బందులు ప‌డుతున్నారు. సంతానం లేక‌పోవ‌డం, ఆర్ధిక‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు, ప‌ని ఒత్తిళ్లు ఇలా అన్నీ ర‌కాల స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొంటు గ‌డిపేస్తున్నారు. ఈ బాధ‌ల‌న్నీ పోవాలంటే 24 నుంచి 28లోపు పెళ్లి చేసుకొని సంసార జీవితాన్ని ప్ర‌శాతంగా అనుభ‌వించ‌వ‌చ్చ‌ని అంటున్నారు వైద్యులు . త్వ‌ర‌గా పెళ్లి చేసుకుంటే జీవితంలో ఎన్ని క‌ష్టాలున్నా వాటిని జ‌యించే శ‌క్తి ఉంటుంద‌ని .. లేటు వ‌యసులో పెళ్లి చేసుకుంటే ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా త‌ట్టుకోలేర‌ని..త‌ద్వారా అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టుముడ‌తాయ‌ని సూచిస్తున్నారు.  25 సంవత్సరాల వయసుతో పోలిస్తే 40 ఏళ్లంటే… సంపాదించే సమయం 15 ఏళ్లు తగ్గిపోయి వుంటుంది. చిన్నారుల భవిష్యత్ ఆందోళనకరం కాకుండా ఉండాలంటే, మరింత సమయం మించిపోకుండా సత్వర నిర్ణయాలు తీసుకోవాలన్నది నిపుణుల అభిప్రాయం.

English Title
11 Reasons Why Getting Married Early

MORE FROM AUTHOR

RELATED ARTICLES