ఒకే ఇంట్లో 11 మంది మృతి కేసులో సంచలన విషయాలు..

Submitted by nanireddy on Mon, 07/02/2018 - 07:57
11-dead-bodies-found-in-new-delhi

దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపిన 11 మంది మృతి వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వారందరిది సామూహిక ఆత్మహత్యగా అనుమానిస్తున్నప్పటికీ.. ఈ విషాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబంలోని ఓ వ్యక్తే అందర్నీ చంపి.. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కుటుంబం శనివారం రాత్రి తిన్న ఆహారంలో మత్తుపదార్థం ఉన్నట్లు ప్రాథమిక నివేదికలు అందడమే ఇందుకు కారణం. హత్యలకు పథకం రచించిన వ్యక్తి.. మత్తుతో అందరూ స్పృహ కోల్పోయాక ఒక్కొక్కరికీ ఉరి వేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. వృద్ధురాలు నిద్రలో నుంచి లేవడంతో ఇరుగుపొరుగును పిలవకుండా నిరోధించేందుకుగాను గొంతునులిమి ఆమెను చంపేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 

English Title
11-dead-bodies-found-in-new-delhi

MORE FROM AUTHOR

RELATED ARTICLES