Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారు దుబారా ఖర్చులకు కళ్లెం వేస్తే బెటర్.. లేదంటే అప్పులపాలయ్యే ఛాన్స్..

daily horoscope in Telugu rasi Phalalu Panchangam today 18th May 2024
x
Highlights

Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారు దుబారా ఖర్చులకు కళ్లెం వేస్తే బెటర్.. లేదంటే అప్పులపాలయ్యే ఛాన్స్..

(తేది : 18-05-2024, శనివారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, శుక్ల పక్షం

తిధి : దశమి ఉదయం గం.11.22 ని.ల వరకు ఆ తర్వాత ఏకాదశి

నక్షత్రం: ఉత్తర (మే 19 తె.వా. గం.12.23 ని.ల వరకు)

అమృతఘడియలు: సాయంత్రం గం.4.16 ని.ల నుంచి గం.6.04 ని.ల వరకు

దుర్ముహూర్తం : తె.వా. గం.5.43 ని.ల నుంచి గం.7.27 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.8.58 ని.ల నుంచి గం. 10.35 ని.ల వరకు

సూర్యోదయం : ఉదయం గం.5.43 ని.లకు

సూర్యాస్తమయం : సాయంత్రం గం.6.42 ని.లకు


మేషం : ఇది అనుకూలమైన రోజు. ముఖ్యమైన పనికి శ్రీకారం చుట్టండి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అవసరమైన డబ్బు చేతికి అందుతుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది.


వృషభం : విచారాన్ని కలిగించే ఘటనలు ఎదురవుతాయి. నిరాశ చెందకండి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకుంటే మేలు. విలువైన డాక్యుమెంట్లు, వస్తువులు జాగ్రత్త. ప్రయాణాలు వద్దు, నవగ్రహాలను దర్శించడం మేలు.


మిథునం : మనసు నిలకడగా ఉండదు. అకారణ దుఃఖం వస్తుంది. ధైర్యాన్ని కోల్పోకుండా కార్యాలను నిర్వహించండి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఆస్తి అమ్మే ప్రయత్నాలు ఫలించవు. దుర్గామాతను పూజించడం మేలు.


కర్కాటకం: అన్ని వైపులా మంచి జరుగుతుంది. ఆదాయం మెరుగవుతుంది. వస్త్రాలు కొంటారు. సోదరుల సహకారం లభిస్తుంది. ముఖ్యమైన సమాచారం అందుతుంది. జీవితభాగస్వామికి దూరంగా వెళ్లాల్సి రావచ్చు.


సింహం: అనుకోని విఘ్నాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులు చికాకు తెప్పిస్తారు. అనవసర నిందలు భరించాల్సి రావచ్చు. కంటి సమస్యలు వస్తాయి. మనసును శాంతంగా ఉంచుకోండి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి.


కన్య: శుభప్రదంగా ఉంటుంది. తలచిన పనులన్నీ సవ్యంగా సాగుతాయి. డబ్బు సమస్య ఉండదు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అనూహ్యమైన బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. మానసిక స్థితి మెరుగవుతుంది.


తుల: మనసుని కలతబార్చే ఘటనలను ఎదుర్కొంటారు. ధైర్యసాహసాలు వృద్ధి చెందుతాయి. దూర ప్రాంతానికి వెళ్లాల్సి రావచ్చు. ఖర్చులు అదుపు చేయండి. మిత్రవిరోధం గోచరిస్తోంది. వ్యర్థ ప్రయాణాలు మానేయండి.


వృశ్చికం: ఇంట్లో శుభకార్య నిర్వహణ యత్నాలు ముందుకు సాగుతాయి. సంతాన వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.


ధనుస్సు: అన్నింటా అనుకూలంగా ఉంటుంది.. అవకాశాలు అందివస్తాయి. ప్రయత్నించిన కార్యం విజయవంతం అవుతుంది. ఇంట్లో శాంతి ఉంటుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది.


మకరం: అవరోధాలను అధిగమిస్తారు. అవసరమైన సౌకర్యాలు సమకూరతాయి. ఇష్టం లేని పనులను చేయాల్సి రావడం చికాకును కలిగిస్తుంది. శారీరకంగాను, మానసికంగా అలసిపోతారు. తగాదాలకు దూరంగా ఉండండి.


కుంభం: పనిచేసే చోట ఆందోళనకర ఘటనలు ఎదురవుతాయి. అధికారులు, పెద్దల ఆగ్రహానికి గురయ్యే సూచన ఉంది. స్వల్ప తగాదాలూ ఉంటాయి. వేళకు భోజనం ఉండదు. శనైశ్చరుడికి ప్రదక్షిణలు మేలు చేస్తాయి.


మీనం: సత్సంబంధాలు ఏర్పడతాయి. బంధుమిత్రులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సూచనలు మరింత మేలు చేస్తాయి. ప్రయాణాలు శుభంగా సాగుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories