YSRCP 8th List: వైసీపీ 8వ జాబితా విడుదల

YSRCP 8th List Released
x

YSRCP 8th List: వైసీపీ 8వ జాబితా విడుదల

Highlights

YSRCP 8th List: వైసీపీ పార్లమెంట్, అసెంబ్లీ ఇంచార్జ్ ల నియామకం

YSRCP 8th List: వైసీపీ తాజాగా పార్లమెంట్, అసెంబ్లీ ఇంచార్జుల 8వ జాబితా విడుదల చేసింది. ఐదుగురు నేతలకు ఇంచార్జులుగా బాధ్యతలు అప్పగించింది. రెండు పార్లమెంటు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు మార్పులు చేర్పులు పోనూ 8వ జాబితాతో కలిపి దాదాపు 72 స్థానాలు ప్రకటించారు. 17 ఎంపీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించినట్లయ్యింది.

గుంటూరు ఎంపీ స్థానానికి కిలారు రోశయ్య, ఒంగోలు ఎంపీ సీటు బాధ్యతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించిన జగన్... పొన్నూరు అసెంబ్లీకి అంబటి మురళి, కందుకూరు నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్, జిడీ నెల్లూరు నుంచి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కల్లత్తూర్ కృపాలక్ష్మికి సమన్వయ కర్తగా బాధ్యతలు అప్పగించారు.

మొదటి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇంచార్జులను నియమించగా.. రెండు జాబితాలో మూడు ఎంపీ, 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు., మూడో జాబితాలో ఆరు ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాలకు ఇంచార్జులను నియమించారు. నాలుగో లిస్టులో ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు, ఐదు జాబితాలో నాలుగు ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇంచార్జిలను నియమించారు. ఆరవ జాబితాలో నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు, ఏడవ జాబితాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయ కర్తలను ప్రకటించారు. తాజాగా ఎనిమిదవ జాబితాలో రెండు పార్లమెంట్, మూడు అసెంబ్లీ స్థానాలకు ఇంచార్జ్ లను సీఎం జగన్ నియమించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories