నేడు తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభ

TDP-Janasena Joint meeting in Tadepalligudem today
x

నేడు తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభ

Highlights

TDP-Janasena: సభకు తెలుగు జన విజయకేతనం జెండాగా నామకరణం

TDP-Janasena: టీడీపీ, జనసేన సీట్ల ప్రకటన తర్వాత తొలిసారి ఇవాళ తాడేపల్లిగూడెంలో ఉమ్మడి సభ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అందరి ఫోకస్ ఈ సభపైనే ఉంది. ఈ సభకు తెలుగు జన విజయకేతనం జెండాగా నామకరణం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ ఈ సభకు హాజరుకానున్నారు. ఓ వైపు సిద్ధం సభలతో అధికార వైసీపీ దూకుడు పెంచుతుండగా.. అంతే దీటుగా జవాబుమిస్తామంటోంది టీడీపీ, జనసేన.

టీడీపీ, జనసేన శ్రేణులకు ఎన్నికలకు సిద్ధం చేసేలా ఇరుపార్టీల అధినేతలు ఎన్నికల రంగంలోకి దిగనున్నారు.మొన్నటి వరకు సీట్ల సర్దుబాటు, పోటీ చేసే అభ్యర్థుల వడపోత కార్యక్రమాల్లో బిజీబీజీగా ఉన్నారు. ఇటీవలే తాము పోటీ చేసే స్థానాలను సంయుక్తంగా ప్రకటించారు. ఇక క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల నేతలు కలిసి కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇవాళ తాడేపల్లిగూడెం వేదికగా జరగబోయే బహిరంగ సభ ద్వారా ప్రచారానికి చుట్టబోతుంది టీడీపీ, జనసేన.

గతంలో లోకేష్ పాదయాత్ర పూర్తయిన సందర్భంగా టీడీపీ ఏర్పాటు చేసిన సభకు పవన్‌కల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో జనసేన ఆధ్వర్యంల జరిగే బహిరంగ సభకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కాగా ఇరుపార్టీల అధినేతలు ఈ బహిరంగ సభ నుంచే ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేసేలా సంసిద్ధం కావాలని పిలుపునివ్వనున్నారు.

ఇక అసెంబ్లీ ఎన్నికల కోసం టికెట్లు ఆశించిన నేతలు భంగపాటుకు గురయ్యారనే చర్చ నడుస్తోంది. టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో అసంతృప్త రాగం వినిపిస్తున్నారు. టికెట్ దక్కలేదనే అసంతృప్తితో ఉన్న నేతలు ఈ సభకు హాజరవుతారా లేదా అనేది క్వశ్చన్‌మార్క్‌గా మారింది. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం ఏర్పడిన పొత్తును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని టీడీపీ చెబుతోంది. సంక్షేమం అభివృద్ధి అనే ఉమ్మడి పార్టీల అజెండాను ప్రజలకు అర్థమయ్యేలా ఈ సభ ద్వారా వివరిస్తామని చెబుతోంది.

అయితే ఈ సభ ద్వారానే వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామంటున్నారు టీడీపీ, జనసేన నేతలు. సిద్ధం సభల పేరుతో సీఎం జగన్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. తాడేపల్లిగూడెం సభ వేదికగా ఆయన వ్యాఖ్యలకు బదులు చెప్తామంటోన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories