Ashwini Vaishnaw: త్వరలో ఏపీలో వందే భారత్ రైలును ప్రారంభిస్తాం..

Railway Minister Ashwini Vaishnavs speech
x

విశాఖ సభలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పీచ్.

Highlights

* 4,668 గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ.. 446 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ

Ashwini Vaishnaw: 446 కోట్లతో విశాఖ రైల్వేస్టేషన్‌ను వరల్డ్ క్లాస్ లెవెల్లో పునర్నిర్మిస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. విశాఖ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. ప్రధాని మోడీ నిర్ణయాలతో రైల్వే వ్యవస్థలను ఆధునికీకరిస్తున్నట్లు మారుస్తున్నట్లు వివరించారు. త్వరలోనే ఏపీలో కూడా వందే భారత్ రైలును ప్రారంభిస్తామని అశ్వినీ వైష్ణవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

సాంకేతికతను గ్రామాల్లోకి తీసుకెళ్లినప్పుడే అభివృద్ధి జరుగుతుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. రాష్ట్రంలో 4 వేల 668 గ్రామాల్లో వరల్డ్ క్లాస్ మొబైల్ కనెక్టివిటీ కల్పిస్తున్నామని వివరించారు. కొత్త స్టేషన్, కొత్త ఏయిర్‌పోర్ట్, కొత్త ట్రైన్లు, ఎకనామిక్ కారిడార్స్‌, డిఫెన్స్ ప్రొటెక్షన్‌తో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు.


Show Full Article
Print Article
Next Story
More Stories