Pawan Kalyan: అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న పవన్ కల నెరవేరుతుందా..?

Pawan Kalyan To Contest From Pithapuram
x

Pawan Kalyan: అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న పవన్ కల నెరవేరుతుందా..?

Highlights

Pawan Kalyan: గతంలో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓటమి

Pawan Kalyan: జనసేన అధినే పవన్ కల్యాన్ ఈసారైనా అసెంబ్లీలోకి అడుగుపెడతారా..? గతంలో రెండు చోట్లా ఓటమితో.. ఈసారి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. గతంలో పోటీ చేసిన భీమవరం, గాజువాకను కాదని ఈసారి పిఠాపురాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి.? అక్కడ పవన్‌కు ఉన్న అనుకూతలు ఏంటి.. మైనస్‌లు ఏంటి.? పొత్తులో భాగంగా.. టీడీపీ నుంచి టికెట్ ఆశించిన అభ్యర్థులు పవన్‌కు సపోర్ట్ చేస్తారా? ఇంతకు పిఠాపురంలో పవన్ ప్రచారం ఎప్పుడు..? అసెంబ్లీలోకి తొలిసారి అడుగుపెట్టాలన్న పవన్ కలను పిఠాపురం ప్రజలు నెరవేర్చుతారా.? ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టి.. అధ్యక్షా అనాలని బలంగా కోరుకుంటున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆ లక్ష్యంతోనే..

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన పవన్.. భీమవరం, గాజువాక రెండు స్థానాల్లో పోటీ చేయగా రెండు సీట్లలోనూ ఓటమి చవి చూశారు. 2019లో వైసీపీ సునామీలో ఓటమి తప్పలేదు. దీంతో అసెంబ్లీలోకి అడుగుపెట్టాలన్న పవన్ ముచ్చట తీరకుండా పోయింది. గత ఓటమి అనుభావాల దృష్ట్యా పోయినసారి పోటీ చేసిన స్థానాల నుంచి కాకుండా.. ఈసారి కొత్త నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు పవన్. వివిధ సర్వే ఫలితాలు, గెలుపు అంచనాల నేపథ్యంలో.. పిఠాపురాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ పవన్ సొంత సామాజిక వర్గమైన కాపు ఓటర్లు ఎక్కువగా ఉండటంతో.. కలిసి వస్తుందనే భావనలో ఉన్నారు పవన్.

పవన్ పోటీతో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ రేపుతోంది. అక్కడి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి. కూటమి నేతలు కలిసి వస్తారా అని అందరి ఫోకస్ పిఠాపురంపై ఉంది. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగా గీత బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబుపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో.. ఎంపీగా ఉన్న వంగా గీతను ఇక్కడ్నుంచి పోటీచేయిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా గెలిచిన వంగా గీత ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, ప్రస్తుత కాడినాడ జిల్లాలోని పిఠాపుర నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు 91 వేల వరకు ఉన్నాయి. అభ్యర్థుల గెలుపుఓటముల్లో వీళ్లే కీలకం కానున్నారు. ఇటు పవన్, అటు వైసీపీ నుంచి ఇద్దరూ కాపులే పోటీచేస్తున్నారు. గత ఎన్నికల్లో కాపు ఓట్లతో గెలిచిన వైసీపీ ఈసారి కూడా ఆ సామాజిక వర్గం తమవైపే ఉందని గట్టిగా నమ్ముతూ గీతను పోటీకి దింపారు. కాపుల ఓట్లను చీల్చడం ద్వారా పవన్ గెలుపును అడ్డుకోవచ్చన్నది జగన్ ప్లానట. ఇందులో భాగంగానే కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి చేర్చుకున్నారని స్థానికంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఈ సారి కాపు ఓటర్లు తనకే సపోర్టుగా ఉంటారనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు పవన్.

ఐతే పిఠాపురంలో కూటమి నేతలు పవన్‌కు సపోర్ట్ చేస్తారా..? జనసేనాని గెలుపు కోస కృషి చేస్తారా అనే చర్చ తెరపైకి వస్తోంది. మొన్నటి వరకు పిఠాపురం స్థానంపై భారీ నమ్మకం పెట్టుకున్నారు టీడీపీ నేత సత్యనారాయణ. కానీ పవన్ ఎంట్రీతో అతని ఆశలకు గండిపడినట్టైంది. కూటమి పొత్తులో భాగంగా పిఠాపురం స్థానాన్ని జనసేనకు కేటాయించారు చంద్రబాబు. పార్టీ అధినేత నిర్ణయాన్ని తొలుత సత్యనారాయణ వర్మతో ఆయన.. వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన చంద్రబాబు..వర్మతో చర్చలు జరిపి ఎమ్మెల్సీ ఇస్తామని హామీనివ్వడంతో పిఠాపురం టీడీపీలో అసంతృప్తి జ్వాలలు చల్లారాయి. పవన్‌ గెలుపు కోసం కృషి చేస్తామని వర్మ ప్రకటించడంతో లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. మద్దతు ఇచ్చేందుకు లీడర్లు ఓకే చెప్పినా.. క్షేత్రస్థాయిలో తమ్ముళ్లు సపోర్ట్ చేస్తారా..ఓటు బదిలీ అవుతాయా అనే చర్చ నడుస్తోంది.

ప్రచారంలో భాగంగా.. మరో నాలుగు రోజుల్లో పవన్ కల్యాణ్ తొలిసారి పిఠాపురం వస్తున్నారు. అక్కడ మూడు పార్టీలకు చెందిన నేతలు, కేడర్ తో సమావేశం కానున్నారు. గ్రామాలవారీగా ప్రచారంపై స్థానిక నేతలకు దిశానిర్థేశం చేయనున్నారు. ఏ అంశాలను ప్రస్తావించాలి ఏ ప్రాంతాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయనే దానిపై చర్చించనున్నారు పవన్. వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లో తీసుకెళ్లాలని సూచించనున్నారు. ఐతే గెలుపు కోసం పక్కా వ్యూహంతో పవన్ ముందుకు వెళ్తుంటే.. జనసేనానిని నిలువరించాలని, ఈసారి కూడా అసెంబ్లీలోకి వెళ్లకుండా వైసీపీ పైఎత్తులు వేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories