ఏపీలో స్పందనకు బ్రహ్మరథం పడుతోన్న జనం

ఏపీలో స్పందనకు బ్రహ్మరథం పడుతోన్న జనం
x
స్పందన
Highlights

పోలీస్ స్టేషన్ గడప తొక్కాలంటే భయపడే రోజులు పోయాయి ఫిర్యాదు చేస్తే చూద్దాములే అనే పరిస్థితి కూడా పోయింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస...

పోలీస్ స్టేషన్ గడప తొక్కాలంటే భయపడే రోజులు పోయాయి ఫిర్యాదు చేస్తే చూద్దాములే అనే పరిస్థితి కూడా పోయింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమంతో ప్రజల్లో మార్పు వస్తోంది. మహిళలు సైతం ధైర్యంగా పోలీస్ స్టేషన్‌‌కి వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఇక పోలీసులు కూడా ఛాలెంజింగ్ తీసుకుని ప్రజల సమస్యలను తీర్చుతున్నారు అయితే, స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన రావడమే కాకుండా ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ నుంచే ప్రశంసలు దక్కడంతో ఏపీ పోలీసులు ఉబ్బితబ్బివుతున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమం ప్రజల మన్ననలు అందుకుంటోంది. ముఖ్యంగా పోలీసులంటేనే భయపడే ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి ఆర్జీలు అందచేస్తున్నారు. ఇక, పోలీస్‌స్టేషన్‌కు రావాలంటేనే భయపడే మహిళలు స్పందన కార్యక్రమానికి వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. స్పందనలో వస్తోన్న ఫిర్యాదుల్లో 52శాతం మహిళలే స్వయంగా ఇచ్చినవి ఉంటున్నాయి. కేవలం ఆర్జీలు తీసుకోవడమే కాకుండా ఫిర్యాదుదారునికి వెంటనే మొబైల్‌కి అక్నాలజ్‌మెంట్ మెసేజ్ ఇవ్వడం అలాగే నిర్ధిష్టమైన టైమ్ పిరియడ్‌లో సమస్యను పరిష్కరించడం లేదా ఉన్నతాధికారికి రిఫర్ చేస్తూ పరిష్కారాలు చూపిస్తుండటంతో స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇక, పోలీసులు కూడా స్పందనలో వస్తోన్న ఆర్జీలను ఛాలెంజింగ్ తీసుకుని పరిష్కరిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 18 వారాల్లో స్పందన ద్వారా 42వేల 220 ఫిర్యాదు వచ్చాయని, అందులో 9వేల 441 కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదైందని, మరో 3వేల 71 కేసుల్లో ఇంతకుముందే ఎఫ్‌ఐఆర్ ఫైల్ అయ్యాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇక, 10వేల 858 ఫిర్యాదులు సివిల్ వివాదాలు అలాగే 6వేల 855 కంప్లైంట్స్ బాడ్లీ అఫెన్స్ 6వేల 454 ఫిర్యాదు క్రైమ్ అగైనెస్ట్ ఉమన్ 5వేల 254 ఇతర సమస్యలు... 4వే475 వైట్ కాలర్ అఫెన్స్‌.... 3వేల 591 ఫ్యామిలీ సమస్యలు... 2వే 353 ప్రాపర్టీ ఇష్యూస్... 964 న్యూసెన్స్‌... 926 రోడ్ యాక్సిడెంట్స్‌.... 257 సైబర్ క్రైమ్... 233 ఎస్సీఎస్టీ ఫిర్యాదులు ఉన్నాయని డీజీపీ వివరించారు. ఇలా, ఇప్పటివరకు వచ్చిన 42వేల 220 ఫిర్యాదుల్లో 40వేల 158 అంటే 95శాతం కంప్లైంట్స్ పరిష్కారమైనట్లు తెలిపారు. కేవలం 2వేల 62 ఫిర్యాదులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయన్నారు.

స్పందన అంటే చాలామందిలో కేవలం ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం మాత్రమేననే అపోహ ఉండేదని, కానీ, ప్రతి ఆర్జీని నిశితంగా పరిశీలించి, పరిష్కరిస్తున్నారని ఫిర్యాదుదారులు అంటున్నారు. గతంలో పోలీస్ స్టేషన్ అంటేనే ఏదో తెలియని భయం ఉండేదని, కానీ ఇప్పుడు ధైర్యంగా వెళ్లి ఆర్జీ ఇవ్వగలుగుతున్నామని, అలాగే పర్టిక్యులర్ టైమ్ పిరియడ్‌లో సమస్య పరిష్కారమవుతుందని అంటున్నారు. అంతేకాదు, పోలీసులు తమకు గౌరవం ఇవ్వడంతోపాటు, మంచినీళ్లు, టీ ఇవ్వడం చూస్తుంటే అసలు ఇది పోలీస్ స్టేషనేనా అనే అనుమానం కలుగుతోందని ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. గతంలో అధికారులను కలవాలంటే కష్టమయ్యేదని, కానీ ఇప్పుడు వాళ్లే తమ సమస్యలు వింటూ ఆర్జీలు స్వీకరిస్తున్నారని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వారానికి ఒక్కరోజు కాకుండా, కనీసం రెండ్రోజులు, లేదా అంటే ఎక్కువ రోజులు పెడితే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని అంటున్నారు.

ఒకవైపు స్పందనకు విశేష స్పందన రావడం మరోవైపు స్పందన గురించి సాక్షాత్తు దేశ ప్రధానే స్వయంగా ఆరా తీయడంతో ఏపీ పోలీసులు గర్వంగా ఫీలవుతున్నారు. గుజరాత్ వడోదరలో నిర్వహించిన పోలీస్ టెక్నికల్ ఎగ్జిబిషన్‌లో ఏపీ స్టాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏపీ స్టాల్‌ను సందర్శించిన ప్రధాని మోడీ స్పందన, వీక్లీ ఆఫ్ సిస్టమ్‌, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్‌, ఫేస్ రికక్నైజేషన్‌, ఈ-విట్‌, డీజీ డ్యాష్ బోర్డ్‌, లాక్డ్ హౌస్‌ మోనిటరింగ్ ఇలా ప్రతి అంశంలోనూ ఏపీ పోలీస్ విధానాలపై ప్రధాని ఆసక్తి చూపించారు. ముఖ్యంగా స్పందన గురించి ప్రధాని కార్యాలయానికి పూర్తి వివరాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు సూచించారు.

అయితే, స్పందన గురించి ప్రధాని ప్రత్యేకంగా అడగడం మెచ్చుకోవడం ఆనందంగా ఉందని, తాము పడుతున్న కష్టానికి, ఏకంగా ప్రధాని నుంచే ప్రశంసలు దక్కడం సంతోషంగా ఉందని స్పందన కోఆర్డినేటర్ అండ్ డీఐజీ పాలరాజు అంటున్నారు. దేశంలో ఎక్కడా స్పందన కార్యక్రమం లేదని, ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు పోలీసులు మరింత చేరువ కావొచ్చని పాలరాజు అభిప్రాయపడ్డారు. ప్రజలకు పోలీసులకు మధ్య వారధిలా స్పందన కార్యక్రమం పనిచేస్తోందని, స్పందనను మరింత పకడ్బందీగా అమలుచేస్తే, పోలీసుల పట్ల అభిప్రాయం మారడమే కాకుండా, గౌరవం కూడా పెరుగుతుందని అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories