CM Jagan: మూడో రోజు సీఎం జగన్ మేమంత సిద్ధం బస్సు యాత్ర

Day Three CM Jagan Memantha Siddham Bus Yatra
x

CM Jagan: మూడో రోజు సీఎం జగన్ మేమంత సిద్ధం బస్సు యాత్ర

Highlights

CM Jagan: పెంచికలపాడు నుంచి ప్రారంభం కానున్న జగన్ బస్సు యాత్ర

CM Jagan: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ప్రారంభించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ మూడో రోజు కొనసాగనుంది. రెండోరోజు నంద్యాల జిల్లాలో నిర్వహించిన మేమంత సిద్ధం యాత్రలో పాల్గొన్న సీఎం జగన్ రాత్రి కర్నూలు జిల్లా పెంచికలపాడులో బస చేశారు. ఇవాళ పెంచికల పాడు నుండి బయల్దేరి పాలకుర్తి మీదుగా కోడుమూరు చేరుకుంటారు. స్థానికులతో ముఖా ముఖి నిర్వహించనున్నారు. స్థానిక నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో నిర్వహించే అవకాశం ఉంది. కోడమూరులో ప్రజలతో మమేకమైన తర్వాత అక్కడి నుండి వేముగోడు, గోనగండ్ల మీదుగా ఎమ్మిగనూరు చేరుకుంటారు.

ఎమ్మిగనూరు నియోజకవర్గం వేముగోడుకు వైసీపీ బస్సు యాత్ర చేరుకోవడంతో నియోజకవర్గ సమన్వయ కర్త బుట్ట రేణుక.. సీఎం జగన్ కు స్వాగతం పలుకనున్నారు. అక్కడి నుంచి గోనెగండ్ల గ్రామంలో ప్రజలతో సీఎం జగన్ ఇంట్రాక్ట్ అవుతారు. అనంతరం ఎమ్మిగనూరు పట్టణానికి చేరుకుని.. వివర్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. మేమంతా సిద్దం యాత్రలో పాల్గొనేందుకు వైసీపీ శ్రేణులు ఉత్సాహం చూపుతున్నారు. బహిరంగ సభలో లక్ష మందికి పైగా జనాలు పాల్గొంటారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. సీఎం జగన్ బస్సు యాత్ర, బహిరంగ సభ నేపధ్యంలో పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు.

వైసీపీ ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా సీఎం జగన్ ఎలాంటి హామీలు ఇస్తారన్నిది నియోజకవర్గ వాసులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అత్యధిక మంది చేనేతలు ఉండటంతో వారి శాశ్వత పరిష్కారం దిశగా.. అడుగు ముందుకు వేసేందుకు సిద్ధమవుతున్నారు. టెక్స్ టైల్ పార్కు తో పాటు వెనుకబడిన సరికొత్త పథకాలు శ్రీకారం చుడుతారని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories