CM Jagan: నేడు పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లతో సీఎం జగన్‌ సమావేశం

CM Jagan Meeting with party regional coordinators today
x

CM Jagan: నేడు పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లతో సీఎం జగన్‌ సమావేశం

Highlights

CM Jagan: మధ్యాహ్నం 3 గంటలకు క్యాంప్‌ ఆఫీసులో సమావేశం

CM Jagan: ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. ఇలా ఎన్నికల కోడ్ కూసిందో లేదో అప్పుడే తమ పార్టీల గెలుపుపై కసరత్తులు ప్రారంభించాయి. నేడు సీఎం జగన్‌.. వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో ఈ సమావేశంలో జగన్ రానున్న ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహించాలన్న దానిపై రీజినల్ కో ఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఎన్నికల ప్రచారంపై...ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ చీఫ్ జగన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 20వ తేదీన మ్యానిఫేస్టోను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఈరోజు జరిగే సమావేశంలో ఎలక్షనీరింగ్ పై కూడా రీజినల్ కోఆర్డినేటర్లకు మార్గదర్శనం చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories