Tirumala: తిరుమలలో వీఐపీల దర్శన సమయాల్లో మార్పు

Change in VIP Darshan Timings in Tirumala
x

Tirumala: తిరుమలలో వీఐపీల దర్శన సమయాల్లో మార్పు

Highlights

Tirumala: రేపటినుంచి ఉదయం 8 గంటలకు వీఐపీలకు అనుమతి

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. రేపటినుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఇన్నాళ్లు వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాన్ని ఉదయం పూట అనుమతించే విధానాన్ని రద్దుచేశారు. రేపు డిసెంబర్ 1వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇకనుంచి బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మార్చబోతున్నారు.

సర్వదర్శనంకోసం గంటల తరబడి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రి వేళ వేచి ఉండే భక్తులకు ఉదయం పూట త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీఐపీల సిఫార్సు లెటర్లపై దర్శన టిక్కెట్లను ఏరోజుకు ఆరోజు మంజూరు చేసేవిధంగా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.

ఇన్నాళ్లు ఎదురైన ఇబ్బందులు ఈ విధానంతో తగ్గుముఖంపడుతుందని టీటీడీ అధికారు విశ్వసిస్తున్నారు. తిరుమలలో యాత్రికులు గదులకోసం పడే ఇబ్బందులుసైతం తగ్గుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈరోజునుంచే శ్రీవాణి ట్రస్టు దాతలకోసం తిరుపతిమాధవంలో ప్రత్యేక కౌంటర్ ప్రారంభిస్తున్నారు. పదివేలరూపాయల విరాళం ఇచ్చే ఒక్కోదాతకు ప్రత్యేక దర్శనం, బసవసతి కల్పించే విధంగా టిక్కెట్లను మంజూరు చేస్తారు. శ్రీవాణి ట్రస్టు దాతల కోసం తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో ఈరోజ ఉదయం 10 గంటలకు టికెట్ కౌంటర్ ప్రారంభిస్తారు. ఇకపై శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఇక్కడే ఆఫ్ లైన్ టికెట్లు కేటాయిస్తారు. శ్రీవాణి ట్రస్టు దాతలకు తిరుపతిలోనే గదులు కేటాయించేవిధంగా చర్యలు తీసుకున్నారు.

తిరుమలకు చేరుకున్న భక్తుల్లో సాధారణ రోజులలో సగటున 70 వేల మంది నుంచి 80 వేల మంది వరకు వస్తుంటే, ఇక వారాంతంలో లక్షకు పైగాదాటుతున్నారు. కటిక పేదల నుండి కోట్లకు పడగెత్తిన ధనవంతుల వరకూ క్యూ కడుతారు.. అయితే శ్రీనివాసుని దర్శనానికి అతి దగ్గరగా కల్పించేందుకు టీటీడీ విఐపి బ్రేక్ దర్శనాలను అమలు చేస్తోంది.. విఐపి బ్రేక్ దర్శనాకు ప్రారంభించిన మొదట్లో ప్రతి రోజు ఉదయం, సాయంకాల సమయంలో రెండు పూట్ల బ్రేక్ దర్శనాలు కల్పించేది.. వీఐపీలు, వివిఐపిలను వారు సిపార్సు చేయబడిన వారికి ప్రత్యేక బ్రేక్ దర్శనాలు కేటాయించి వారిని దర్శనానికి అనుమతించేవారు.. అయితే కాలక్రమేణా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఘనీయంగా పెరడం, సాయంకాలం సమయంలో విఐపి బ్రేక్ లో దర్శనం‌పొందిన వారే ఉదయం కూడా స్వామి వారి సేవలో పాల్గోంటూ ఉండడంతో సామాన్య భక్తులు ఇబ్బందుకు గురవుతున్నారు..

ప్రొటోకాల్ ప్రాతిపదికన శ్రీవారి దర్శనం వచ్చేవారితోపాటు పాలకమండలి సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులను వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లను మంజూరు చేసేవారు. వీరందరికీ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమయంలో దర్శనం చేసుకునే విధంగా సమయాన్ని కేటాయించారు. విఐపి బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేపడుతూ LEVAL-1,LEVAL-2,LEVAL-3 విధానంను అమలు చేస్తూ వచ్చారు. ఈ విధానంలో విఐపి భక్తులకు హోదా తగ్గట్టుగా వారికి స్వామి వారి దర్శనంను కల్పించేవారు. ఇందులో విఐపి బ్రేక్ దర్శనం టిక్కెట్టుగా ఐదు వందల రూపాలే అయినా ఒక్కోక్కరికి ఒక్కోలా దర్శనం ఉండడంతో దీనిపై భక్తుల నుండి వ్యతిరేకత రావడంతో ఓ భక్తుడు కోర్టును ఆశ్రయించాడు.. దీంతో పాలక మండలి సర్వత్రా విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది.‌

కోర్టు ఆదేశాల మేరకు టీటీడీ ఈవో బ్రేక్ దర్శనాలపై వివరణ ఇచ్చారు.. అటుతరువాత వైసీపి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఏర్పడిన పాలక మండలి విఐపి బ్రేక్ దర్శనాల్లో మార్పులు చేస్తూ ఎల్ 1,ఎల్ 2 ,ఎల్ 3 విధానాన్ని రద్దు చేసింది.. వాటి స్ధానంలో ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు ప్రోటో కాల్ దర్శనం, మిగిలిన వారికి వి.ఐ.పి దర్శనాని టీటీడీ నేటికి‌ అమలు చేస్తూ వస్తోంది..

టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి సామాన్య భక్తులకు స్వామి‌వారి దర్శన భాగ్యంను త్వరితగతిన కల్పించాలని భావించి పాలక మండలి సమావేశంలో ఆమోదించారు.. అయితే‌ ముందు వీఐపి బ్రేక్‌ దర్శనాలను ఉదయం పది గంటల నుండి అమలు చేయాలని భావింయచారు. అదే సమయంలో‌ కళ్యాణోత్సవం భక్తులు ఆలయ ప్రవేశం చేసే సమయం కావడంతో‌ కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించింది టీటీడీ.. దీంతో‌ సాధ్య సాధ్యాలను పరిక్షించేందుకు ఓ కమిటీని వేసి అధ్యయనం చేశారు.

శ్రీవారి దర్శన అధ్యయన కమిటీ నిర్ణయంతో డిసెంబరు ఒకటోవ తారీఖు నుండి టీటీడీ ఈ విధానంను ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది.. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రి వేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలవుతుందని టీటీడీ అధికారులు అభిప్రాయం వ్యక్తంచేశారు. తిరుమలలో గదులకోసం వీఐపీల తాకిడి తగ్గి సామాన్యులకు గదులు సులభంగా అందుబాటులో ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమల్లో ఎలాంటి ఫలితాలు దక్కుతాయోనని వెంకన్న భక్తులు ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories