Delhi: ఢిల్లీలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్.. నేడు అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం

Chandrababu and Pawan Kalyan in Delhi
x

Delhi: ఢిల్లీలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్.. నేడు అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం

Highlights

Delhi: భేటీ అయిన తర్వాత పొత్తులపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం

Delhi: నేడు అమిత్‌షాతో మరోసారి చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ భేటీ కానున్నారు. ఇప్పటికే బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి మధ్య పొత్తు కుదిరింది. జనసేన ఇదివరకు 24 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించినా ప్రస్తుతం బీజేపీ కూటమిలో చేరాలని నిర్ణయించాక ఇరు పార్టీలకు కలిసి కుదిరిన 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల్లో ఒక సీటు అటూఇటుగా సర్దుకుపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. బహుశా బీజేపీ ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయొచ్చని చెబుతున్నారు. అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ రెండు పార్టీల మధ్య ఒకటి అటూఇటుగా సర్దుబాటు జరిగే అవకాశం ఉంది. 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలపై మూడు పార్టీలూ అవగాహనకు వచ్చినందున ఆ స్థానాలపై తదుపరి చర్చ జరగవచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి మూడు పార్టీల అగ్రనేతలు శుక్రవారం మరోసారి సమావేశం కావాలనుకున్నా అమిత్‌ షా, జేపీ నడ్డాలకున్న ముందస్తు కార్యక్రమాల వల్ల సాధ్యం కాలేదని తెలిసింది. దీంతో ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మిగిలిన అన్ని అంశాలపై పూర్తి ఒప్పందం చేసుకునే అవకాశమున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ పొత్తులపై మూడు పార్టీల వారెవ్వరూ అధికారికంగా ప్రకటించలేదు. భేటీ అయిన తర్వాత దీనిపై అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories