Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్‌ టీజర్‌పై ఏపీ సీఈవో స్పందన

AP CEO Reaction On Ustad Bhagat Singh Teaser
x

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్‌ టీజర్‌పై ఏపీ సీఈవో స్పందన

Highlights

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్‌ మూవీ టీజర్‌ వివాదం

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్‌ మూవీ టీజర్‌ వివాదంపై ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. ఆ మూవీ టీజర్ ఇంకా చూడలేదని.. టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే మాత్రం ఈసీ అనుమతి తీసుకోవాలన్నారాయన. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా..హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది...గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అంటూ...పవన్ చెప్పిన ఈ రెండు డైలాగ్స్‌ ఇప్పుడు కాంట్రవర్సీ అయ్యాయి.

జనసేన అధినేత పవన్ కూడా ఈ డైలాగ్స్ పైన స్పందించారు. సినిమాలో ఆ గాజు డైలాగ్ చెప్పడం తనకు ఇష్టం లేదని.. కానీ హరీష్ శంకర్ బాధ భరించలేక ఆ డైలాగ్ చెప్పాల్సివచ్చిందని చెప్పుకొచ్చారాయన. ఈ టీజర్ వివాదం ఏపీ సీఈవో దృష్టికి రావడంతో..ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే మాత్రం ఈసీ అనుమతి తీసుకోవాలన్నారాయన.

Show Full Article
Print Article
Next Story
More Stories