MLC Kavitha: రౌస్ అవెన్యూ కోర్టులో కవితకు చుక్కెదురు

BRS MLC Kavitha Bail Petition Rejected by Court
x

MLC Kavitha: రౌస్ అవెన్యూ కోర్టులో కవితకు చుక్కెదురు 

Highlights

MLC Kavitha: లిక్కర్ కేసులో కవితకు దక్కని ఊరట

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. లిక్కర్ పాలసీలో ఈడీ, సీబీఐ కేసులో కవితకు ఊరట దక్కలేదు. తనకు బెయిల్ కావాలని కవిత దాఖలు చేసిన పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు జడ్జి కావేరి బవేజా. లిక్కర్ పాలసీ కేసులో కవిత కింగ్ పిన్‌గా పేర్కొన్న దర్యాప్తు సంస్థల వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు... కవిత బయటకు వస్తే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని, ఆధారాలు, సాక్షాలను కవిత తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

గతంలో కేసుకు సంబంధించిన ఆధారాలు ధ్వసం చేసారని, మొబైల్ డేటా డిలీట్ చేసారని, సాక్షులను బెదిరించారన్న ఈడీ, వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. కవితకు బెయిల్‌ మంజూరు చేయలేదు. అయితే.. కేసులో కవితకు వ్యతిరేకంగా నేరుగా ఎటువంటి ఆధారాలు లేనందున, ఆరోగ్య కారణాలు దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలన్న కవిత వాదనలను కోర్ట్ పరిగణలోకి తీసుకోలేదు. అయితే... రౌస్ అవెన్యూ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై హైకోర్ట్‌ను ఆశ్రయించే యోచనలో కవిత తరపు న్యాయవాదులు ఉన్నట్టు తెలుస్తుంది.

ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేయగా.. ఇదే కేసులో ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న కవిత.. తుది తీర్పు వరకూ జైలులోనే ఉండనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories