MI vs SRH: సూర్యకుమార్ సూపర్ సెంచరీ.. సన్ రైజర్స్ పై ముంబై ఘన విజయం

Mumbai Indians win by 7 wickets against Sunrisers
x

MI vs SRH: సూర్యకుమార్ సూపర్ సెంచరీ.. సన్ రైజర్స్ పై ముంబై ఘన విజయం

Highlights

MI vs SRH: 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం

MI vs SRH: ఐపీఎల్ 2024లో వరుస ఓటములు చవి చూసిన ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంది. ముంబైలోని వాంఖడే స్డేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం మూడు వికెట్లు కోల్పోయి 17.2 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయ్యింది.

లక్ష్య చేధనలో ముంబై 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ నన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. సొంత గ్రౌండ్ లో సూర్య సెంచరీతో చెలరేగాడు. 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్ లతో 102 పరుగులతో అజేయంగా నిలిచి అద్భుతమైన విజయాన్ని అందించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories