Horoscope Today: సోమవారం.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Horoscope Today: సోమవారం.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
(06-05-2024, సోమవారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, చైత్ర మాసం, ఉత్తరాయణం, వసంతరుతువు, బహుళ పక్షం,
తిధి : త్రయోదశి మధ్యాహ్నం గం.2.40 ని.ల వరకు, ఆ తర్వాత చతుర్దశి,
నక్షత్రం : రేవతి సా. గం.5.43 ని.ల వరకు అనంతరం అశ్వని
అమృతఘడియలు: మధ్యాహ్నం 3.32 నుంచి సా.4.59 వరకు
వర్జ్యం: ఉదయం గం.6.50 ని.ల నుంచి ఉదయం గం.8.17 ని.ల వరకు,
దుర్ముహూర్తం : మ.12.39 నుంచి 1.30 వరకు, తిరిగి 3.13 నుంచి 4.04 వరకు
రాహుకాలం : ఉదయం గం. 7.24 ని.ల నుంచి ఉదయం గం.9.00 ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం గం. 5.48 ని.లకు,
సూర్యాస్తమయం : సాయంత్రం గం. 6.38 నిలకు
ఇవాళ్టి విశేషం : మాస శివరాత్రి
మేషం :
పనులకు ఆటంకాలు కలిగించే వారుంటారు. అప్రమత్తంగా ఉండండి. బంధువుల వైద్యం కోసం ధనవ్యయం చేయాల్సి రావచ్చు. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభం :
రోజంతా ఆనందకరంగా సాగుతుంది. శుభకార్యాల్లో ఆత్మీయులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. సంతాన సంబంధ వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. మిత్రులు తోడుగా నిలుస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
మిథునం :
ఆశించిన ఫలితాన్ని పొందుతారు. శత్రువులపై గెలుపు సాధిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. పెద్దల ఆదరాభిమానాలు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది.
కర్కాటకం :
స్వల్ప ఒడుదుకులున్నా చేపట్టిన పనులు సవ్యంగా సాగుతాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. దూర ప్రాంతానికి వెళ్లాల్సి రావచ్చు. బలహీనతలను బయటపెట్టకండి. ఇష్టదేవతా ప్రార్థన మీకు ప్రశాంతతనిస్తుంది.
సింహం :
అప్రమత్తంగా ఉండాలి. మీ దుందుడుకు స్వభావాన్ని తగ్గించుకుంటే అధికారులు, పెద్దల మన్ననలు పొందగలుగుతారు. తగాదాలకు దూరంగా ఉండండి. పైత్య సంబంధ సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు.
కన్య :
రోజంతా సంతృప్తిగా సాగుతుంది. శారీరక, మానసిక శాంతిని పొందుతారు. ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి. బంధుమిత్రులను కలుస్తారు. కీర్తి పెరుగుతుంది. జీవితభాగస్వామి సూచనలు పాటించండి.
తుల :
చేపట్టిన పని విజయవంతం అవుతుంది. ధనలాభం ఉంది. కీలకమైన సమయానికి బంధుమిత్రులు తోడుగా నిలుస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.
వృశ్చికం :
ఆటంకాలుంటాయి. శత్రువుల కదలికలను ఓకంట కనిపెట్టి ఉండండి. తెలివితేటలకు గుర్తింపు లభించదు. నిరాశ వద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లను భద్రంగా దాచండి.
ధనుస్సు :
ఇవాళ ఖర్చులను బాగా అదుపుచేయాలి. బంధువర్గంతో విరోధం గోచరిస్తోంది. స్థిర,చరాస్తులు అమ్మే ప్రయత్నాలు వాయిదా వేయండి. స్వల్ప మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. విష్ణువును పూజించండి.
మకరం :
శుభఫలితాలు లభించడంతో ఉల్లాసంగా ఉంటారు. అనుకోనిరీతిలో డబ్బు చేతికందుతుంది. మీకు అత్యంత ప్రియమైన వ్యక్తులను కలుస్తారు. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమూ వృద్ధి చెందుతుంది.
కుంభం :
ఎవరికీ పూచీగా ఉండకండి. అనవసర తగాదాలకు కారణమవుతుంది. డబ్బుకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. వేళకు భోజనం ఉండదు. ఇంట్లో చికాకులుంటాయి. మానసిక అశాంతి నివారణకు గణపతిని పూజించండి.
మీనం :
అన్ని రంగాల వారూ పురోభివృద్ధిని సాధిస్తారు. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. కొత్త బాధ్యతలు అంతులేని ఆనందాన్నిస్తాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. విందుల్లో పాల్గొంటారు. కీర్తి పెరుగుతుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire